Thursday, December 18, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మండలంలో ప్రశాంతంగా ముగిసిన స్థానిక పోరు

మండలంలో ప్రశాంతంగా ముగిసిన స్థానిక పోరు

- Advertisement -

– బీఆర్ఎస్(6), కాంగ్రెస్(6), రెండు చోట్ల స్వతంత్రులు విజయం
నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండలంలో మూడో విడతలో భాగంగా 13 గ్రామాల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు విజయం సాధించారు. ఉప్లూర్ సర్పంచ్ గా ఎనుగందుల శైలేందర్ (స్వతంత్ర), నాగాపూర్ సర్పంచ్ గా కప్పదండి అశోక్ (కాంగ్రెస్), రాజరాజేశ్వరి నగర్ సర్పంచ్ గా తైద సుశీల సాయన్న (టిఆర్ఎస్), కమ్మర్ పల్లి సర్పంచ్ గా కొత్తపల్లి హారిక అశోక్ (టిఆర్ఎస్), హాస కొత్తూర్ సర్పంచ్ గా రేణి గంగాధర్ (కాంగ్రెస్), బషీరాబాద్ సర్పంచ్ గా బైకాన్ జమున మహేష్ (టిఆర్ఎస్), కోన సముందర్ సర్పంచ్ గా బెజ్జారం రాకేష్ (టిఆర్ఎస్), నర్సాపూర్ సర్పంచ్ గా బుసపురం సంధ్య రాజశేఖర్ (టిఆర్ఎస్), ఇనాయత్ నగర్ సర్పంచ్ గా బాణావత్ లలితా రాములు (కాంగ్రెస్), కొత్తచెరువు తండా సర్పంచ్ గా లకావత్ సంతోష్ (కాంగ్రెస్), అమీర్ నగర్ సర్పంచ్ గా ఊరే నీలవేణి (స్వతంత్ర), చౌట్ పల్లి సర్పంచ్ గా మహబూబ్ (టిఆర్ఎస్), కోనాపూర్ సర్పంచ్ గా రిక్క అరుణ్ కుమార్ (కాంగ్రెస్) విజయం సాధించారు. ఇంతకుముందే దొమ్మరి చౌడు తండా సర్పంచ్ గా గూగులావత్ మంజుల (కాంగ్రెస్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 

ఎన్నికైన ఉప సర్పంచులు వీరే….

ఉప్లూర్ ఉప సర్పంచ్ గా తక్కురి ముత్యం, రాజరాజేశ్వరి నగర్-ద్యాగ ప్రసాద్, అమీర్ నగర్-మాలావత్ పద్మ, బషీరాబాద్ చిలువేరి-భూమేశ్వర్, చౌట్ పల్లి-సట్టా విశాల్, దొమ్మరి చౌడు తండా-జరుపుల నరేష్, హాస కొత్తూర్- ఏనుగు మనోహర్, ఇనాయత్ నగర్-మకిలి అనిల్ కుమార్, కమ్మర్ పల్లి- కొత్తపల్లి అశోక్, కోనాపూర్-మోర్తాడ్ ఉదయ్, కోన సముందర్-భలేరావ్ శంకర్, కొత్తచెరువు తండా- గుగులావత్ రమేష్, నాగాపూర్-ఉల్లెంగుల శశిధర్, నర్సాపూర్- కట్ట రాజ్ కుమార్ ఉపసర్పంచులుగా ఎన్నికయ్యారు.కాగా 13 గ్రామపంచాయతీలో 6 పంచాయతీలను టిఆర్ఎస్, 6 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీలో గెలుచుకోగా రెండు పంచాయతీల్లో  స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. గెలుపొందిన సర్పంచ్, ఎన్నికైన ఉపసర్పంచ్ లకు ప్రెసిండింగ్ అధికారులు నియామక పత్రాలు అందజేశారు. గెలుపొందిన అభ్యర్థులు గ్రామాల్లో అనుచరులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -