నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మూడు నెలల ముందుగా 2026 జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. ఐదేళ్ల పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందుగా ఎన్నికల నిర్వహణకు చట్టంలో ఉన్న వెసులుబాట్ల మేరకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని పంచాయతీరాజ్, పురపాలక శాఖల కమిషనర్లకు బుధవారం లేఖలు రాశారు. ప్రస్తుత సర్పంచుల పదవీ కాలం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో.. నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ల పదవీకాలం వచ్చే ఏడాది మార్చిలో ముగియనుంది. ఆలోగానే జనవరిలో ఎన్నికల నిర్వహణకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖలో పేర్కొన్నారు.
ఏపీలో 3 నెలల ముందే స్థానిక ఎన్నికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES