విజన్ డాక్యుమెంట్, ప్రజా ప్రభుత్వ ద్వితీయ వార్షికోత్సవాలపై ప్రధాన చర్చ
నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని సచివాలయంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో… ఇదే ఊపులో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం నిర్ణయించారు. అందువల్ల క్యాబినెట్‌లో ఈ అంశం కీలకం కానుంది. లోకల్ ఫైట్‌కు సంబంధించి ఏయే జిల్లాల్లో పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి? బీసీ రిజర్వేషన్లు, దానిపై హైకోర్టులో కేసు, న్యాయస్థానం వెలువరించే తీర్పునుబట్టి ఎలాంటి వైఖరి తీసుకోవాలి? అనే అంశాలపై సీఎం, మంత్రులు ప్రధానంగా చర్చించనున్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి డిసెంబరు 7 నాటికి రెండేండ్లు పూర్తి కావొస్తున్న నేపథ్యంలో…’ప్రజా పాలన-ద్వితీయ వార్షికోత్సవాల’ను నిర్వహణలు, సభలు, సమావేశాలు, సదస్సుల ఏర్పాట్లు తదితరాంశాలపై ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేయనున్నారు. దీనికి కొనసాగింపుగా ‘తెలంగాణ రైజింగ్-2047, విజన్ డాక్యుమెంట్’ రూపకల్పన, అందుకోసం తీసుకోవాల్సిన ప్రాతిపదికలు, ఆ డాక్యుమెంట్ ఆధారంగా చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళిక మొదలగు అంశాలపై మంత్రివర్గం చర్చించనుందని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.
పథకాలపై సమీక్ష…
ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేకపోతోందంటూ ప్రతిపక్షాలు విమర్శించినప్పటికీ జూబ్లీహిల్స్‌లో అవేమీ పని చేయలేదని ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నారు. తమ రెండేండ్ల పాలనను ఓటు ద్వారా ప్రజలు ఆదరించారని వారు అభిప్రాయ పడుతున్నారు. అందువల్ల రానున్న రోజుల్లో ఇవే పథకాలను మరింత పకడ్బందీగా అమలు చేయటం, ఆరు గ్యారెంటీల్లో మిగతా వాటిపై దృష్టి సారించటం, ఆ మేరకు ఆదాయ వనరుల సమీకరణ, అందుకోసం ఎలాంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలి… ఇలాంటి ముఖ్యమైన విషయాలపై క్యాబినెట్‌లో చర్చించనున్నారని సమాచారం.
తెల్లారుజామున క్యాబినెట్ ఎజెండా
ఏ సంస్థకైనా, ఏ వ్యవస్థకైనా ‘సమావేశపు అజెండా’ అనేది కీలకం. ఆ మీటింగుకు సంబంధించిన షెడ్యూల్, దాని ఎజెండాలోని ముఖ్యాంశాల సమాచారం కొద్ది రోజుల ముందుగా ఇవ్వటం నిర్వాహకుల ప్రాథమిక విధి. తద్వారా మీటింగులో పాల్గొనే సభ్యులు ఎజెండాలోని అంశాలను క్షుణ్నంగా పరిశీలించి, అధ్యయనం చేయటమనేది ఇక్కడ ముఖ్యోద్దేశం. ఇది సమావేశానికి పరిపూర్ణతను చేకూరుస్తుంది. కానీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశపు ఎజెండాను మాత్రం అందుకు భిన్నంగా పంపుతున్నారని సమాచారం. క్యాబినెట్ ముందు రోజు వరకూ ఎజెండా పంపకుండా. ఏ రోజైతే మంత్రివర్గపు భేటీ ఉంటుందో.. అదే రోజు తెల్లారుజామున మూడు నాలుగు గంటలకు దాన్ని పంపుతున్నారని తెలిసింది.
అది కూడా రెండొందల నుంచి మూడొందల పేజీలతో కూడిన ప్రతిని పంపుతున్నారు. దీనివల్ల ఇటు మంత్రులు, అటు ఉన్నతాధికారులు కూడా దాన్ని ఏమాత్రం చదవలేకపోతున్నారని వినికిడి. అయినా ఎజెండా విషయంలో మంత్రులు, ఉన్నతాధికారుల వద్ద కూడా ఇంత గోప్యత ఎందుకనే విమర్శలు ఇప్పుడు వెల్లువెత్తుతున్నాయి. దీన్ని ప్రభుత్వం సవరించుకోవాలనే సూచనలు కూడా వస్తున్నాయి. సోమవారం నిర్వహించబోయే క్యాబినెట్ సమావేశపు ఎజెండా సైతం ఆదివారం రాత్రి వరకూ మంత్రులు, అధికారులకు చేరకపోవటం గమనార్హం.
స్థానికమే కీలకం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



