Thursday, December 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బెల్టు షాపులకు తాళాలు.!

బెల్టు షాపులకు తాళాలు.!

- Advertisement -

ఈ నెల 17 వరకు కోడ్ ఉన్నందున బంద్
నవతెలంగాణ – మల్హర్ రావు

పల్లెల్లో పంచాయతీ ఎన్నికలు మొదలు కావడంతో బెల్టుషాపులను ఎక్సైజ్ అధికారులు మూసివేయించారు. ఎన్నికల్లో విజయం కోసం అభ్యర్థులు జోరుగా మద్యం పంపిణీ చేస్తారనే ఉద్దేశ్యంతో వైన్స్ నుంచి మద్యం తరలించే విషయంలోను రేషన్ విధానం అమలు చేస్తున్నారు. వైన్స్ నుంచి ఎవరైనా మద్యం కొనుగోలు చేస్తే ఏడు ఫుల్ బాటిళ్లు లేదా ఒక కాటన్ బీర్లు మాత్రమే విక్రయించాల్సి ఉంది. గతంలో మూకుమ్మడిగా మద్యంను విక్రయించడం, తరలించడం జరిగేది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో మద్యం రవాణాపై నిఘా పెంచారు. ప్రజలను ప్రలోభపెట్టడానికి మద్యం కూడా ఒక ఆయుధం కావడంతో మద్యం అమ్మకాలపై నియంత్రణ విధించారు.

గ్రామాల్లో బెల్ట్ షాపులకు అనుమతి లేకపోవడంతో కొందరు వ్యక్తులు హోల్ సెల్ గా మద్యం కొనుగోలు చేసి బెల్టుషాపులను నిర్వహిస్తున్నారు. గ్రామాభివృద్ధి కమిటీలు ఆదాయం కోసం బెల్టుషాపులకు వేలంపాటలను నిర్వహించి మద్యం అమ్మకాలకు ఆమోదం తెలుపుతున్నాయి. బెల్టుషాపులను నిర్వహించడం చట్ట విరుద్దమైనప్పటికి ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గకూడదనే ఉద్దేశ్యంతో బెల్టుషాపుల నిర్వహణకు అడ్డు చెప్పడం లేదు.

ఈనెల 17 వరకు..
ఎన్నికల కోడ్ అమలు చేసిన సందర్భంలోనే ముందస్తుగానే ఎక్సైజ్ శాఖ అటు బెల్టుషాపుల నిర్వా హకులకు, ఇటు వైన్స్ యజమానులకు ఎన్నికల కోడ్ అమలు సమాచారం అందించారు.ఈనెల 17 వరకూ పంచాయతీ ఎన్నికల తంతు కొనసాగనుం ది.దీంతో ఎన్నికల కోడ్ ముగిసేవరకూ మద్యం అమ్మకాలపై పక్కాగా నియంత్రణ ఉంటుందని అధికార యంత్రాంగం స్పష్టం చేసింది. అప్పటి వరకూ బెల్టుషాపులను మూసి ఉంచాలని ఎక్సైజ్ శాఖ ఆదేశాలను జారీ చేసింది.నిబంధనలకు విరుద్దంగా ఎవరైనా మద్యం తరలిస్తే కేసులను నమోదు చేయడం మద్యంను, వాహనాలను సీజ్ చేయనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -