- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : వివాదాలు, కేసులను త్వరగా పరిష్కరించుకోవడానికి డిసెంబర్ 21వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో లోక్ అదాలత్ జరగనున్నది. హైకోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కక్షిదారులను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరింది. సివిల్ కేసులు, వివాహ సంబంధిత వివాదాలు వంటివితో పాటు రాజీ పడే అవకాశం ఉన్న క్రిమినల్ కేసులను పరిష్కరించుకోవచ్చు. ఇందులో ట్రాఫిక్ చలాన్ల పరిష్కారం లేదు.
- Advertisement -



