నవతెలంగాణ-హైదరాబాద్: బీహార్ ఎస్ఐఆర్‌పై పార్లమెంట్‌లో చర్చ జరగాలని విపక్షాలు ఆందోళన చేపట్టగా…మరోవైపు జాతీయ క్రీడా పరిపాలనా బిల్లు, జాతీయ యాంటీ-డోపింగ్ సవరణ బిల్లులకు ఇవాళ లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఆ బిల్లులను క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ ఇవాళ సభలో ప్రవేశపెట్టారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రీడల్లో జరిగిన అతిపెద్ద సంస్కరణజాతీయ క్రీడా పరిపాలన బిల్లు అని మంత్రి తెలిపారు. క్రీడాకారులు వైభవోపేతంగా వెలిగిపోవాలన్న ఉద్దేశంతో క్రీడా గవర్నెన్స్ బిల్లును తీసుకువచ్చినట్లు మంత్రి చెప్పారు. క్రీడా వ్యవహారాల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే ఉద్దేశం కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు.యాంటీ డోపింగ్ బిల్లు కూడా కొత్త చట్టమే అని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న డోపింగ్ విధానాలను ఇది సమర్థిస్తుందన్నారు. పారదర్శకంగా డోపింగ్ చర్యలు చేపట్టే విధంగా చూడనున్నట్లు చెప్పారు.
కీలక బిల్లులకు లోక్ సభ ఆమోదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES