Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుఅవేవీ ఉండవని నేను ముందే చెప్పాను..కూలీ రిజల్ట్ పై లోకేష్ స్పందన

అవేవీ ఉండవని నేను ముందే చెప్పాను..కూలీ రిజల్ట్ పై లోకేష్ స్పందన

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేకపోయింది. సాధారణంగా లోకేష్ సినిమాలు అంటే వేరే లెవల్ ఎక్స్ పెక్టేషన్లు ఉంటాయి. లోకేష్ యూనివర్స్ స్థాయికి మించి కూలీపై ఫ్యాన్స్ అంచనాలు పెట్టేసుకున్నారు. కానీ అంచనాలు మొత్తం తప్పాయి. మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. స్టోరీ వీక్ గా ఉండటంతో పాటు పాత్రల్లో డెప్త్ లేదు. సాదా సీదాగా అనిపించే సీన్లతో కూలీ అంచనాలను అందుకోలేకపోయాడు. ఈ రిజల్ట్ పై ఫస్ట్ టైమ్ లోకేష్ స్పందించాడు. ఈ సినిమా ట్రైలర్ చూసి చాలా మంది ఇది టైమ్ ట్రావెల్ కథ అనుకున్నట్టు తెలిపాడు.

ప్రేక్షకులు ఏవేవో అంచనాలు పెట్టేసుకున్నారు. టైమ్ ట్రావెల్ కథ అని, ఎల్ సీయూలో భాగం అని రకరకాల అంచనాలతో థియేటర్లకు వచ్చారు. అవేవీ ఉండవని నేను రిలీజ్ కు ముందే చెప్పాను. అయినా వాళ్లు పట్టించుకోలేదు. అందుకే వారి అంచనాలకు తగ్గట్టు మూవీ లేదు. దానికి నేనేం చేయలేదు. అయినా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు కథలు రాయలేను. ప్రేక్షకులకు నచ్చలేదంటే ఈ సారి మరింత గట్టిగా ట్రై చేస్తాను. ఆడియెన్స్ ఊహించలేని కథతో సినిమా చేస్తాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు లోకేష్.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad