Saturday, September 6, 2025
E-PAPER
spot_img
Homeజాతీయంశిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై లుకౌట్ నోటీసు

శిల్పా శెట్టి, రాజ్ కుంద్రాపై లుకౌట్ నోటీసు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. కోట్ల రూపాయల మోసం ఆరోపణలకు సంబంధించిన కేసులో ముంబై పోలీసులు వారిద్దరిపై లుక్అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. వ్యాపారం కోసం తీసుకున్న డబ్బును పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) దర్యాప్తును వేగవంతం చేసింది.

‘బెస్ట్ డీల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్’ అనే తమ సంస్థ విస్తరణ పేరుతో శిల్పా దంపతులు తన వద్ద నుంచి సుమారు రూ.60 కోట్లు తీసుకున్నారని దీపక్ కొఠారి అనే వ్యాపారవేత్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2015 నుంచి 2023 మధ్య కాలంలో ఈ డబ్బును తీసుకున్నారని, దానిని వ్యాపారానికి కాకుండా వ్యక్తిగత ఖర్చులకు వాడుకున్నారని ఆయన ఆరోపించారు. తీసుకున్న డబ్బును అప్పుగా చూపి, పన్ను ఆదా కోసం దానిని పెట్టుబడిగా మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తాను పెట్టిన పెట్టుబడికి ఏటా 12% వడ్డీతో పాటు అసలు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చారని కొఠారి తెలిపారు. దీనికి సంబంధించి 2016 ఏప్రిల్‌లో శిల్పా శెట్టి స్వయంగా తనకు లిఖితపూర్వకంగా వ్యక్తిగత హామీ ఇచ్చారని ఆయన వివరించారు. అయితే, ఆ హామీ ఇచ్చిన కొద్ది నెలలకే శిల్పా శెట్టి కంపెనీ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారని తెలిపారు. అంతేకాకుండా, ఆ సంస్థపై అప్పటికే రూ.1.28 కోట్ల దివాలా కేసు నడుస్తోందన్న విషయాన్ని కూడా తన వద్ద దాచిపెట్టారని ఆయన ఆరోపించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad