– భక్తిశ్రద్ధలతో పూజలు నైవేద్యాలు
నవతెలంగాణ-మల్హర్ రావు : గణపతి నవరాత్రి ఉత్సవాల్లో మండలంలో ఊరురా,వాడవాడల్లో వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి సంవత్సరం భద్రాపద మాసంలో వచ్చే చవితి తిథి రోజున వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం.ఆదిదేవుడైన శ్రీ విఘ్నేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాలు ఈనెల 27 నుండి సెప్టెంబర్ 4 వరకు ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీ విఘ్నేశ్వర అనుగ్రహం ఉంటే అంతా శుభం జరుగుతుందని ప్రగాఢ విశ్వాసంతో భక్తులు ఈ తొమ్మిది రోజులపాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ భక్తిశ్రద్ధలతో భజనలు చేస్తుంటారు.నవరాత్రుల చివరి రోజున పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ శ్రీ విఘ్నేశ్వరుని ఊరేగింపు నిర్వహించిన అనంతరం పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేస్తారు.
మండపాల్లో కొలువుదీరిన వినాయకుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES