- Advertisement -
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
ఆటోని లారీ ఢీ కొట్టిన సంఘటనలో ఇద్దరు మృతి చెందిన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం జులకల్ గ్రామ సరిహద్దు దగ్గర టమాట బాక్సులతో శాంతినగర్ కు వెళుతున్న ఆటోను లారీ వెనక నుండి ఢీ కొట్టింది. ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు పచ్చర్ల గ్రామ వాసులుగా గుర్తించారు.
- Advertisement -



