నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
లూయీస్ బ్రెయిలీ 217 వ జన్మదినంను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మినీ సమావేశం మందిరంలో కె నర్సింహా రావు, జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ అధ్యక్షతన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమములో జిల్లా కలెక్టర్ అంధులందరితో కలసి లూయీస్ బ్రెయిలీ చిత్రపటానికి పూలమాల వేసి, కేకును కట్ చేసి, ఆయన కనిపెట్టినటువంటి లిపి ఎంతో మంది అంధుల జీవితాలలో వెలుగులు నింపి వారు అన్నీ రంగాలలో ముందడుగు వేయడానికి తోడ్పడిందని తెలియజేశారు.
అనంతరం జిల్లా సంక్షేమ అధికారి మాట్లాడుతూ.. బ్రెయిలీ కనిపెట్టిన 6 చుక్కల లిపి గురించి, ఆయన జీవిత విశేషాల గురించి సభాసదులకు తెలియజేశారు. ఈ కార్యక్రమములో ధరణి కోట నర్సింహులు (అంధుడు), లూయీస్ బ్రెయిలీ గురించి మాట్లాడుతూ లూయీస్ బ్రెయిలీ అంధుల జీవితాలకు ఆశాజ్యోతి అని ఆయన కనుగొన్న లిపి వలన అంధులమందరము చదువుకొని వివిధ రంగాలలో ఉద్యోగాలు పొందగలుగుచున్నామని తెలిపారు. ఈ కార్యక్రమములో జిల్లా కమిటీ, అసోసియేషన్ మెంబర్లు, కార్యాలయ సిబ్బంది, దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొని జన్మదిన వేడుకల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



