– రూ.2499కే 71 గజాల ఇల్లు అంటూ ప్రచారం
నవతెలంగాణ-బోడుప్పల్
తన ఇంటిని విక్రయించడం కోసం ఓ వ్యక్తి ”లక్కీ డ్రా” పేరుతో బంపర్ ఆఫర్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళితే.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలో ఓ వ్యక్తి 71 గజాల్లో ఉన్న జీ ప్లస్-1 ఇంటిని కేవలం రూ.2499కే సొంతం చేసుకోవచ్చని మేడిపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఓ ప్రకటన బోర్డు ఏర్పాటు చేశాడు. ఈ లక్కీ డ్రాలో నాలుగు రకాల బహుమతులు గెలుచుకోవచ్చని పేర్కొన్నారు. మొదటి బహుమతిగా ఇల్లు, రెండో బహుమతిగా హౌండా యాక్టివా స్కూటర్, మూడో బహుమతిగా ఫ్రిడ్జ్, నాలుగో బహుమతిగా వాషింగ్ మెషిన్, ఐదో బహుమతిగా స్మార్ట్ టీవీ ఆఫర్ ఉందని ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు నేరుగా కానీ ఆన్‌లైన్‌లో కానీ కొనుగోలు చేయాలని సూచించారు. ఈ లక్కీ డ్రాను వచ్చే ఏడాది జనవరి 26న తీస్తామని తెలిపారు. ఇటీవల యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. రూ.500 కూపన్‌తో ఇంటి స్థలాన్ని లక్కీ డ్రా పద్ధతిలో అమ్మగా.. ఓ చిన్నారి పేరున వచ్చిన విషయం విదితమే. అయితే, ఇలాంటి లక్కీ డ్రాల పేరిట రాష్ట్రంలో అక్కడక్కడా మోసాలు కూడా జరిగిన సంగతి తెలిసిందే.
‘లక్కీ డ్రా’ బంపర్ ఆఫర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



