Saturday, January 10, 2026
E-PAPER
Homeక్రైమ్12 ఏండ్ల బాలికను గర్భవతిని చేసిన కామాంధుడు

12 ఏండ్ల బాలికను గర్భవతిని చేసిన కామాంధుడు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
ఓ మైనర్ గిరిజన బాలికను ఓ కామాంధుడు గర్భవతిని చేసిన ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన 12 ఏళ్ల లోపు గిరిజన మైనర్ బాలిక గత దసరా సెలవులకు, ఇదే మండలంలోని ఓ గ్రామానికి చెందిన తన అమ్మమ్మ ఇంటికి వచ్చి కొంతకాలం ఇక్కడే ఉంది. 

ఈ క్రమంలోనే ఇదే గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువకుడు మైనర్ బాలికను పరిచయం చేసుకోని మాయ మాటలు చెప్పి శారీరకంగా కలిశాడు. కాగా, గడిచిన కొద్ది రోజులుగా సదరు బాలిక ఆరోగ్య బాగోలేక పోవడంతో కుటుంబీకులు స్థానిక ఓ ఆస్పత్రి కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా.. నాలుగు నెలల గర్భవతిగా తెలిసింది. 

ఈ ఘటనపై కొంతమంది పెద్దలు స్థానికంగా పంచాయతీ నిర్వహించేందుకు యత్నించగా.. ఈ విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి పోలీసులకు సమాచారం అందించి బాలికను ఆస్పత్రికి తరలించారు. దీనిపై మైనర్ బాలిక తల్లి స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -