నవతెలంగాణ-పాలకుర్తి: పిచ్చికుక్క దాడి చేయడంతో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం మండల కేంద్రంలో గల వల్మిడి క్రాస్ రోడ్డు వద్ద చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాలకుర్తి గ్రామానికి చెందిన కమ్మగాని నిక్షిత్, కొండాపురం పెద్ద తండా కు చెందిన గుగులోతు రవి నాయక్, మల్లంపల్లి గ్రామానికి చెందిన వంగాల ఎల్లమ్మల పై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందిజ. పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యులు జనగామ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించారని తెలిపారు.
మండల కేంద్రంలో కుక్కల స్వైర్య విహారంతో రెండు రోజుల్లో పది మందిని గాయపరిచాయని తెలిపారు. పాలకుర్తి గ్రామానికి చెందిన చిన్నారి గాదెపాక కార్తికేయను గాయపరిచింది. కుక్కలను నివారించేందుకు ప్రభుత్వంతో పాటు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టాలని, ప్రజల ప్రాణాలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.



