- Advertisement -
నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండల కేంద్రంలో రజక సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రజకుల ఆరాధ్య దైవమైన మడేలేశ్వర స్వామి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలతో కాలినడకన వెళ్ళి స్వామివారికి బోనాలు సమర్పించారు.రజకులు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురవాలని పాడిపంటలు, ఆయురారోగ్యాలతో ప్రజలు విలసిల్లాలని ఈ పండుగ నిర్వహిస్తామని అన్నారు. కార్యక్రమంలో భాగంగా మునిమాణిక్యం అశోక్, కిషన్, అజయ్, సాయి, చేపూరి రాజు, చేపూరి సుమన్, మహేష్, కృష్ణ, సవీన్, సంతోష్, వినోద్, భూమేష్, రజక సంఘ సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -