Wednesday, August 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మద్నూర్ మార్కెట్ కమిటీకి రెగ్యులర్ సెక్రటరీ రావాలి..

మద్నూర్ మార్కెట్ కమిటీకి రెగ్యులర్ సెక్రటరీ రావాలి..

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీల సెక్రెటరీల పాలన మూడు నెలల ముచ్చటగానే కొనసాగుతుంది. రెగ్యులర్ సెక్రెటరీ రాలేకపోవడం అభివృద్ధి పనులకు ఆటంకాలు కలుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్కెట్ కమిటీ తెల్ల బంగారం పత్తి కొనుగోళ్లలో రాష్ట్రంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ప్రఖ్యాతగాంచింది. పత్తి కొనుగోలు ద్వారా మార్కెట్ కమిటీకి ప్రతి సంవత్సరం కోట్లల్లో ఆదాయం వస్తుంది. ఇలాంటి ఆదాయం కలిగిన మార్కెట్ కమిటీకి రెగ్యులర్ సెక్రటరీలు రాకుండా మూడు నెలల ముచ్చటగానే వస్తున్నారు.. వెళ్తున్నారు. ప్రస్తుతం జూన్ 31 నుండి మద్నూర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ పోస్టు ఖాళీగానే ఉంది. ఇన్చార్జిల పాలనతో మార్కెట్ కమిటీ అభివృద్ధికి వ్యవసాయ రైతులకు ఆటంకాలు కలుగుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫిబ్రవరి 21 2024న విట్టల్ సెక్రెటరీ 2024 జులై 31న సాధారణ బదిలీలో భాగంగా ఇక్కడి నుండి వెళ్లిపోయారు ఆయన స్థానంలో బోధన్ మార్కెట్ కమిటీ సెక్రటరీగా విధులు నిర్వహించే రామ్నాథ్ అక్టోబర్ 11న వచ్చారు డిసెంబర్ 31 వరకు విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2025 జనవరి 1న శ్రీకాంత్ అనే సెక్రెటరీ ఇంచార్జిగా వచ్చి మార్చ్ 20 వరకు విధులు నిర్వహించారు. ఆ తర్వాత మార్చి 22 నుండి పి రమేష్ వచ్చారు జూన్ 31 వరకు రెగ్యులర్ సెక్రెటరీగా విధులు నిర్వహించారు. ఆయన పదవి విరమణ పొందడం జూన్ 31 నుండి ప్రస్తుతం మద్నూర్ మార్కెట్ కమిటీ సెక్రెటరీ పదవి ఖాళీగానే ఉంది. ఇక్కడికి ఎవరు వచ్చినా ఇన్చార్జిలు కాకుండా రెగ్యులర్ సెక్రెటరీ రావాలని రైతులు కోరుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -