Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeసినిమాదేశంలోకి వస్తున్న ఓ కొత్త సమస్యతో 'మదరాసి'

దేశంలోకి వస్తున్న ఓ కొత్త సమస్యతో ‘మదరాసి’

- Advertisement -

‘ప్రస్తుతం హీరో శివ కార్తికేయన్‌కు మాస్‌లో మంచి ఇమేజ్‌ పెరిగింది. అలాంటి మాస్‌ హీరోతో నేను చెప్పాలనుకున్న పాయింట్‌ను చెబితే ఎక్కువ మందికి రీచ్‌ అవుతుంది. అందుకే ‘మదరాసి’ చిత్రాన్ని ఆయనతో తెరకెక్కించాను’ అని దర్శకుడు మురుగదాస్‌ అన్నారు.
శివ కార్తికేయన్‌, రుక్మిణి వసంత్‌, విద్యుత్‌ జమ్వాల్‌ ప్రధాన పాత్రలో ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కించిన చిత్రం ‘మదరాసి’. ఈనెల 5న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.
తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్‌ బ్యానర్‌ మీద భారీ ఎత్తున రిలీజ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు మురుగదాస్‌ మీడియాతో చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
వెస్ట్రన్‌ కంట్రీస్‌లో ఆల్రెడీ ఉన్న సమస్యలు, మన దేశంలోకి వస్తున్న ఇలాంటి ఓ కొత్త సమస్యను బేస్‌ చేసుకుని ఈ కథను రాసుకున్నాను. ఇందులోని సబ్జెక్ట్‌ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్‌తో ఈ మూవీని తెరకెక్కించాను.
– ఈ చిత్రంలో హీరో పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. శివ కార్తికేయన్‌కు ఈ కథ చెప్పిన వెంటనే నచ్చడం, వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయింది. నేను అనుకున్న కథకి ఆయన ప్రాణం పెట్టి చేశారు. ఇందులో రుక్మిణి వసంత్‌ పాత్ర కూడా చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. అందరికి రిలేట్‌ అయ్యే కారెక్టర్‌ను ఆమె చేశారు. ప్రస్తుతం ఆమె మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా మారిపోయారు(నవ్వుతూ).
– ‘తుపాకి’ కథను విద్యుత్‌ జమ్వాల్‌కి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్‌ అయి ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. ఓ హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌లో ఆయన బిజీగా ఉన్నారు.ఈ కథ ఆయనకు బాగా నచ్చడంతో విలన్‌గా చేసేందుకు అంగీకరించారు. ఇందులో యాక్షన్‌ సీక్వెన్స్‌ అద్భుతంగా వచ్చాయి. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే పోరాట సన్నివేశాలు అదిరిపోతాయి. హీరో, విలన్‌ మధ్య వచ్చే యాక్షన్‌ ఘట్టాలు ఆడియెన్స్‌ను అబ్బురపరుస్తాయి.
– ఇంత వరకు మ్యూజిక్‌ అంటే.. పాటలు, లిరిక్స్‌ అనుకునేవారు. కానీ అనిరుధ్‌ మాత్రం బీజీఎంతో దేశాన్ని ఊపేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన అద్భుతమైన మ్యూజిక్‌, ఆర్‌ఆర్‌ ఇచ్చారు. నేను చేసిన సీన్లను అనిరుధ్‌ తన ఆర్‌ఆర్‌తో నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకువెళ్లారు. మంచి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియెన్స్‌ ఇచ్చేలా ఆర్‌ఆర్‌ ఇచ్చారు. అనిరుధ్‌ మ్యూజిక్‌ వరల్డ్‌లో ఇంకా గొప్ప స్థాయిని చేరుకుంటున్నారు.
– శ్రీ లక్ష్మీ మూవీస్‌, ఎన్వీ ప్రసాద్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఆయన ఈ మూవీ కోసం ఎంతో ఖర్చు పెట్టారు. అనుకున్న అవుట్‌ పుట్‌ వచ్చే వరకు ఎక్కడా కాంప్రమైజ్‌ కాకుండా నిర్మించారు. మన దగ్గర ప్రస్తుతం ప్రపంచస్థాయి కంటెంట్‌ వస్తోంది. మన భారతీయ చిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad