- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్: మద్నూర్ మండల కేంద్రంలోని గాంధీ చౌక్ ఆవరణంలో ఏర్పాటు చేసిన మున్నూరు కాపు గణేష్ మండలి వద్ద సోమవారం నాడు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల కేంద్రంలో సోమవారం సంత రోజు అయినందున మండల కేంద్ర ప్రజలతో పాటు మండలంలోని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. మండల కేంద్రంలో అత్యధికంగా మున్నూరు కాపులే ఉన్నందున ఈ గణేష్ మండలి వద్ద ప్రతి సంవత్సరం మహా అన్నదాన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాత్రికి భజన కీర్తన ఉంటుందని మున్నూరు కాపు గణేష్ మండలి నిర్వాహకులు తెలిపారు.
- Advertisement -