Wednesday, September 3, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్గౌరీ పుత్ర వినాయక మండపం ఆధ్వర్యంలో మహా అన్నదానం

గౌరీ పుత్ర వినాయక మండపం ఆధ్వర్యంలో మహా అన్నదానం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మడంపల్లి గ్రామంలో గౌరీపుత్ర వినాయక మండపం సభ్యుల ఆధ్వర్యంలో బుధవారం నాడు మహా అన్నదాన ప్రసాదాన్ని పేదలకు, గ్రామస్తులకు వితరణ చేశారు. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. వినాయక చవితి ప్రారంభం నుండి నిత్యము పూజలు అందుకుంటున్న విగ్నేశ్వరుడు గ్రామస్తులకు రైతులకు కార్మికులకు కర్షకులకు సుభిక్షతగా ఉండాలని, రైతుల ఇండ్లలో సిరి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ నిత్యం పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నేటి రోజు గ్రామ ప్రజలకు మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టడం జరిగిందని గౌరీపుత్ర వినాయక మండపం సభ్యులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌరీపుత్ర వినాయక సంఘం సభ్యులు ముఖేడే సంతోష్ , ధానేవార్ సంతోష్ , కేళీగే బస్వంత్ , కుర్మన్ పల్లి శివరాజ్ , కూర్మన్ పల్లి మాధవరావు , హెండేవార్ రాహుల్ ,, డి. శివరాజ్ , హెచ్ . శ్రీకాంత్ , బి . సిద్దేశ్వర్, బి . రాజు , ఎక్స్ ఆర్మీ మ్యాన్ కాశీనాథ్ తప్ప మఠ్ పతి , నాధుడే బస్వంత్ ( శీను ) తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad