Saturday, August 23, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా

ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఇందిరా పార్కు వద్ద మహాధర్నా

- Advertisement -

– కామారెడ్డి నుండి హైదరాబాద్ బయలుదేరిన యుఎస్పిసి  నాయకులు,ఉపాద్యాయులు
నవతెలంగాణ –  కామారెడ్డి

దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలైన పిఆర్సి,  పెండింగ్ డిఏలు, సిపిఎస్ రద్దు, 317 బాధిత ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయులకు నగదు రహిత హెల్త్ కార్డుల మంజూరి, 398 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు,  డీఎస్సీ – 2004 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం… తదితర 63 డిమాండ్ల సాధన కోసం ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ యుఎస్పిసి ఆధ్వర్యంలో ఈరోజు హైదరాబాదులోని ఇందిరాపార్క్ దగ్గర జరుగుతున్న మహా ధర్నాకు కామారెడ్డి నుండి యుఎస్పిసి నాయకులు బయలుదేరారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే  ఉద్యోగ సంఘాల  జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా రాష్ట్ర వ్యాప్త బస్ యాత్ర,  రాష్ట్ర స్థాయి ధర్నా ద్వారా ప్రభుత్వానికి బుద్ది చెప్పవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ ధర్నాకు నాయకులు  టీఎస్ యుటిఎఫ్  జిల్లా అధ్యక్షులు ఆకుల బాబు , టీపీటీఫ్ జిల్లా అధ్యక్షులు చింతల లింగం, డీటీఫ్ జిల్లా అధ్యక్షులు దేవుల, టి ఎస్ పి టి ఏ జిల్లా అధ్యక్షులు నరేందర్ యుఎస్పిసి జిల్లా నాయకులు  వెంకటరెడ్డి, నళిని, ప్రభాకర్ , సాయిలు, నీరడి నారాయణ, శ్రీనివాస్, శ్యామ్, వాణి, ,సాంగోజు, బాలయ్య, బాబురావు,, నారాయణ, ప్రకాష్, గఫర్, అన్వర్, హరీష్, సునీల్, రూప్సింగ్, గోపాల్, దేవిజేయా నాయక్ తదితరులు వెళ్లారు.  

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad