నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను రూ.8000 కోట్లు చెల్లించాలని కోరుతూ తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో రోడ్డుపై మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గవ్వల భరత్ కుమార్ హాజరై, మాట్లాడారు. స్కాలర్షిప్ లు, ఫీజు బకాయిలు, హాస్టల్ సొంతభవనాలు, ఫీజు రియంబర్స్మెంట్ లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
పెండింగ్ లో ఉన్న 8000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వేలాదిమంది విద్యార్థులు భువనగిరి బాయ్స్ ప్రభుత్వ కాలేజ్ నుంచి ప్రిన్స్ చౌరస్తా వరకు ర్యాలీ, రాస్తారోకో నిర్వహించారు. సంక్షేమ హాస్టల్స్లకు సొంతభవనాలు నిర్మించాలి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వాలి మెస్ చార్జీలు పెంచాలి విద్యార్థులకు ఇస్తా అన్న ఐదు లక్షల భరోసా కార్డు ఇవ్వాలి 100రోజుల్లోనే విద్యార్థుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు.
గ్రూప్1,2,3, పోస్టుల ట్స్నుం టీఎస్ నుంచి టీజీకి పేరు మార్పుకు రూ.2700 కోట్లు ఖర్చుపెట్టిన ఈ గొప్ప ప్రభుత్వానికి స్కైవర్లకు, ఫ్లైఓవర్లకు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలకు లక్షల కోట్లు ఉంటాయని అన్నారు. కానీ విద్యార్థులకు ఇవ్వడానికి డబ్బులు లేవని, ప్రభుత్వం చేతులు దులుపుకుంటోందని అన్నారు. సంక్షేమ హాస్టలకు సొంత భవనాలులేవు, ఉన్న అద్దె కొంపలకు బెచ్చులూడి విద్యార్థులు చనిపోయే ప్రమాదం ఉన్నా.. ఈ ప్రభుత్వం నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆర్ కృష్ణన్న కొట్లాడి, విద్యార్థుల కోసం పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించే విధంగా పెట్టిస్తే ఆ జీవోను ఈ ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు.
రాజకీయంగా, ఆర్థికంగా విద్యా పరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎదగకుండా ప్రభుత్వం, నాయకులు కుట్ర చేస్తున్నారని అన్నారు. ఇక ఊరుకునే ప్రసక్తే లేదని, ఈ ప్రభుత్వం వెంటనే విద్యార్థుల ఫీజు బకాయిలను విడుదల చేయాలని, పెంచిన ఫీజులన్నీ ప్రభుత్వమే భరించాలని ఈ సందర్బంగా డిమాండ్ చేశారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని, జనాభా తమాషా ప్రకారం గా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజకీయ అవకాశాలు కల్పించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఎంపి ఆర్ కృష్ణన్ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు, బస్సులు దాహనాలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్యనారాయణ, సామాజికవేత బట్టు రామచంద్రయ్య, బీసీ సంఘం నాయకులు ఎడ్ల మహాలింగం, అరుణ్ నాయక్, నల్ల గుణవర్ధన్, చిల్లర రాకేష్, సందీప్, నగేష్ యాదవ్, గిరిధర్, లోకేష్, తరుణ్ తేజ్, శిరీష మనీ పాల్గొన్నారు.