వేసవిలో అవసరము ఉన్న చోట్ల అదనపు కాంటాలు – కొత్త సభ్యత్వానికి అవకాశమని తీర్మానం
నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములోని సొసైటీ కార్యాలయంలో శనివారము ప్రత్యేక అధికారి మురళి అధ్యక్షతన మహాజన సభ కార్యక్రమము నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రైతు సోదరుల సమక్షంలో సొసైటీ కార్యదర్శి గుజ్జుల సంతోష్ రెడ్డి, జమ ఖర్చుల నివేదికను చదివి వినిపించారు. అనతరం సభలో సభ్యుల కోరిక మేరకు వేసవి వరి వరి కొనుగోళ్ల సందర్బంలో వరి ఎక్కువ వచ్చిన సెంటర్ లల్లో అదనపు కాంటాలను కేటాయించి రైతులకు ఇబ్బందులు కలుగకుండా త్వరగా కొనుగోళ్లు చేసే విధనగా చూడాలని ఆదేశించారు.
అలాగే సోసిటీలో నూతన సభ్యత్వం అవకాశం కల్పించాలని కోరగా ,అధ్యక్షులు సమాధానం ఇస్తూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా త్వరగా కొనుగోళ్లు పూర్తి అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వేసవి తాపానికి ఇబ్బందులు కలగకుండా సెంటర్ లల్లో టెంటుతోపాటు త్రాగు నీటి సౌకర్యం కల్పిస్తామని, ఓ ఆర్ ఎస్ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. అవసరము ఉన్న చోట్ల అదనపు కాంటాలను ఏర్పాటు చేస్తామని, కొత్త సభ్యత్వం విషయంలో ఉన్నత అధికారులకు నివేదిక పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమములో తాజా మాజీ చెర్మెన్ చెలిమెల మల్లికార్జున,ఆర్మూర్ చిన్న బాలరాజ్,మాలవత్ బాలు,నౌసి ,రైతు సోదరులు పాల్గొన్నారు.



