నవతెలంగాణ – ఆలేరు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం రాష్ట్రంలోని మహిళల్లో మంచి ఆదరణ పొందిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అసెంబ్లీలో మాట్లాడారు. హైదరాబాదు అసెంబ్లీ నుండి నవతెలంగాణ కు పంపిన వీడియోలో మాట్లాడుతూ.. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట దేవస్థానం కొండపైకి వెళ్లే బస్సుల్లో కూడా మహిళలకు వర్తింపజేయాలన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి గ్రామానికి ఎలక్ట్రిక్ బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. గ్రామాలలో పాఠశాలకు సెలవులు వచ్చినప్పుడు బస్సులు నడపడం లేదని దీంతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని యధావిధిగా బస్సులు నడిపేందుకు చర్య తీసుకోవాలన్నారు.
యాదగిరిగుట్ట నుండి రాష్ట్ర నలుమూల జిల్లా కేంద్రాలకు బస్సులు నడిపే విధంగా ఎలక్ట్రిక్ బస్సులను అందజేయాలన్నారు.యాదగిరిగుట్ట దేవస్థానానికి అన్ని జిల్లా కేంద్రాల నుండి బస్సులను నడిపినట్లయితే దేవ స్థానానికి భక్తుల రాక పెరిగి దేవస్థాన ఆదాయం పెరగడంతో పాటు భువనగిరి యాదగిరిగుట్ట ప్రాంతాల అభివృద్ధి చెందుతాయి అన్నారు. భువనగిరి ప్రాంతం లో ఎత్తైన ఖిల్లా ఆలేరులో దేశంలోనే పేరు పొందిన జైన ఆలయం క్రీస్తుపూర్వానికి చెందిన సోమేశ్వరాలయం కోటి ఒక్క లింగం గొలనుకొండలో ఆదిమానవుల కాలం నాటి శివాలయం రేణిగుంటలో వెంకటేశ్వర ఆలయం సురేంద్రపురిలో సమస్త దేవతలు భువనగిరి మండలంలో స్వర్ణ గిరి భక్తులు చూడదగిన గుళ్ళు చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయని పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ఎంతో అనువైన ప్రాంతం యాదాద్రి భువనగిరి అన్నారు.
ఈ ప్రాంతం అభివృద్ధి పరచేందుకు పర్యాటక శాఖ ద్వారా దేశవ్యాప్తంగా ప్రచారం కల్పించాలన్నారు రైలు రోడ్డు రవాణా వ్యవస్థల ద్వారా భక్తులకు రాకపోకలకు సౌకర్యం కల్పించినట్లయితే.భక్తులు ఆనందం పొందడంతో పాటు ప్రాంత అభివృద్ధి జరుగుతుందని.సభాపతి ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు.



