Sunday, November 16, 2025
E-PAPER
Homeఖమ్మంఅధ్వానంగా ప్రధాన రహదారులు.. 

అధ్వానంగా ప్రధాన రహదారులు.. 

- Advertisement -

ఇబ్బంది పడుతున్న ప్రజలు..
నవతెలంగాణ – మణుగూరు
ప్రధాన రహదారులు, మరియు అంతర్గత రహదారులు అద్వాన్నంగా ఉన్నాయని యుద్ధ ప్రాతిపదికన గుంతలు పూడ్చాలని బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు కుర్రి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారంభద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు రేగ కాంతారావు  ప్రధాన రహదారులపై యుద్ధం ప్రకటించిన సందర్భంగా మణుగూరు మండలం లోని సమితి సింగారం గ్రామపంచాయతీ ఏరియా అశోక్ నగర్ ప్రధాన రహదారిపై గుంతలను పరిశీలించారు. మెయిన్ రోడ్డుపై వచ్చే వాహనా దారుల రాకపోకల ఇబ్బందులను గమనించి తక్షణమే చిత్తశుద్ధితో పాలకులు ఈ యొక్క గుంతలను మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు మండల బిఆర్ఎస్  పార్టీ అధ్యక్షులు సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, టౌన్ అధ్యక్షులు కుంట లక్ష్మణ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు వట్టం రాంబాబు, ఎడ్ల శ్రీనివాస్, యాదగిరి గౌడ్, గువ్వ రాంబాబు, ప్రభుదాస్, బీసీ సెల్ అధ్యక్షులు అక్కి నరసింహారావు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు వేర్పుల సురేష్, గడదేసి మధుబాబు, తాత రమణ, మునిగేల శ్రీను, వాయిలాల నరసయ్య, కొండ వేర్పుల శంకర్, అప్పయ్య సుధా వెంకటేశ్వర్లు, ముస్తఫా, మునిగేల రాంబాబు, ఉప్పుతల రామారావు, దొడ్డ మోహన్, మూడు చందర్, వనమాల రాంబాబు, యూత్ నాయకులు గుర్రం సృజన్, జక్కం రంజిత్ కుమార్, నగరపు సతీష్, ఎన్న బాను, నాగారపు సతీష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -