కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ కోరిన భువనగిరి ఎంపీ చామల
నవతెలంగాణ – ఆలేరు
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రానికి సమీపంలో గల బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్లో ప్రధాన రైళ్లు అన్ని హాల్టింగ్ ఇవ్వాలని బుధవారం ఢిల్లీలో కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ జి నీ భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. ఈ సందర్భంగా ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. బొమ్మాయి పల్లి రైల్వే స్టేషన్లో అన్ని రైళ్లకు హాల్టింగ్ ఇస్తే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, రైతులు తోపాటు చేనేత వస్త్రాల వ్యాపార అభివృద్ధి జరుగుతుందని కేంద్రమంత్రి కి వివరించినట్లు చెప్పారు.
తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన లక్ష్మీనరసింహస్వామి ఆలయంతో పాటు దేశంలో ఖ్యాతిగాంచిన జైన్ మందిర్ 2000 సంవత్సరాల క్రితం నాటి సోమేశ్వరాలయం, ప్రఖ్యాతిగాంచిన భువనగిరి ఖిల్లాతో పాటు వెంకటేశ్వర ఆలయం, స్వర్ణగిరి కి రోజుకు వేలాది మంది భక్తులు వస్తున్నారని చెప్పారు. బొమ్మాయిపల్లి రైల్వే స్టేషన్ ఆధునికరించి ప్రయాణికులకు రైళ్ల హాల్టింగ్ ఇచ్చినట్లయితే త ద్వారా పర్యాటకంగా ఈ ప్రాంతం అభివృద్ధితోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రికి వివరించినట్లు తెలిపారు.



