Wednesday, September 10, 2025
E-PAPER
spot_img
Homeసినిమా'మెజెస్టీ ఇన్‌ లవ్‌..'

‘మెజెస్టీ ఇన్‌ లవ్‌..’

- Advertisement -

నిర్మాత అజయ్ మైసూర్‌, నటి, ‘బిగ్‌ బాస్‌ 7’ ఫేమ్‌ శుభశ్రీ నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నటులు సాయి కుమార్‌, హీరో సోహైల్‌, బిగ్‌ బాస్‌ షో కంటె స్టెంట్స్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు పాల్గొని ఈ నూతన జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నిశ్చితార్థ వేడుకలో అజరు మైసూర్‌, శుభశ్రీ కలిసి చేసిన ‘మెజెస్టీ ఇన్‌ లవ్‌’ సాంగ్‌ను లాంచ్‌ చేశారు. సాయికుమార్‌ వాయిస్‌తో ఈ పాట ప్రారంభం కావడం ఆకర్షణగా నిలిచింది. ఈ సాంగ్‌ను సిద్ధార్థ్‌ వాట్కిన్స్‌ స్వరపర్చి సింగర్‌ సాహితీ చాగంటితో కలిసి పాడారు. ఈ పాట రూపకల్పన సమయంలోనే అజరు మైసూర్‌, శుభశ్రీ మనసులు కలిశాయి. వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాలని నిశ్చయించు కున్నారు. జూలైలో అజరు మైసూర్‌, శుభశ్రీ వివాహం ఆస్ట్రేలియాలో జరగనుంది. ప్రొడ్యూసర్‌ అజరు మైసూర్‌ అజరు మైసూర్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’, ‘టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌’ వంటి చిత్రాలతో పాటు పలు షార్ట్‌ ఫిలింస్‌, 50కి పైగా మ్యూజిక్‌ అల్బమ్స్‌లో నటించారు. సాయికుమార్‌ మాట్లాడుతూ,’అజరు మైసూర్‌ నాకు మంచి మిత్రులు. ఈ జంట చిరకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ‘మెజెస్టీ ఇన్‌ లవ్‌’ పాట అద్భుతంగా వచ్చింది’ అని అన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad