- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్ లోని బాలాపూర్‌లో ప్లాస్టిక్ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున ఒక్కసారిగా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. సమాచారం అందడంతో అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఘటన సమయంలో పరిశ్రమలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఇటీవల జరిగిన సిగాచీ పరిశ్రమ ప్రమాదంలో భారీగా ప్రాణ నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం తరవాత ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ మళ్లీ అలాంటి ఘటనలో చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
- Advertisement -