- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హాంగ్‌కాంగ్ తాయ్ పో జిల్లాలోని వాంగ్ ఫక్ అపార్ట్మెంట్ బ్లాక్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు నలుగురు మరణించారు. 2వేలకు పైగా ఫ్లాట్లు ఉన్న ఈ భారీ భవనాల్లో మంటలు చెలరేగడంతో అనేక మంది లోపల చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అగ్నిప్రమాదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- Advertisement -



