- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలోని రిథాల మెట్రోస్టేషన్ సమీపంలోని మురికివాడ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదంలో ఒక చిన్నారి సహా పలువురికి గాయాలైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా.. ప్రమాదంలో గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటల తీవ్రత మరింత పెరిగి గుడిసెలన్నీ దగ్ధమైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగ అలుముకోవడంతో బాధితులకు ఎటువెళ్లాలో అర్థం కాలేదు. శుక్రవారం రాత్రి బెంగాలీ బస్తీలోని గుడిసెలలో చెలరేగిన మంటలను అదుపు చేసేందుకు 29 ఫైరింజన్లు తీవ్రంగా శ్రమించాయి. అగ్నిప్రమాదాన్ని అంచనా వేసిన అధికారులు.. మీడియం కేటగిరకి చెందినదిగా ప్రకటించారు.
- Advertisement -



