– రూ.50 కోట్ల ఆస్తి నష్టం
నవతెలంగాణ – కూకట్ పల్లి
హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట్ గూడ్స్ షెడ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సుమారు రూ.50 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం ఇండియన్ కంటైనర్ కార్పొరేషన్ డిపోలోని గోడౌన్ నంబర్లు 6, 7, 8లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించడంతో అక్కడ నిల్వ ఉన్న బ్యాటరీలు, లిక్కర్ బాటిళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని ఆరు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. అగ్నిమాపక సిబ్బందికి తోడుగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, పోలీసులు సహాయ చర్యల్లో పాల్గొన్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా, మరే ఇతర కారణమా అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ, సుమారు రూ.50 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు అధికారుల అంచనా.
మూసాపేటలో భారీ అగ్నిప్రమాదం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



