Tuesday, December 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే

- Advertisement -

నవతెలంగాణ – మోపాల్ 
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు సోనియా గాంధీ జన్మదిన సందర్బంగా కులస్పూర్ లో ఆమె చిత్ర పటానికి రూరల్ ఎమ్మెల్యే  భూపతిరెడ్డి పాలాభిషేకం చేశారు. దాని అనంతరం మోపాల్ మండలం కులస్పూర్ గ్రామంలో తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదిన సందర్బంగా ఆమె చిత్ర పటానికి రూరల్ ఎమ్మెల్యే పాలాభిషేకం చేశారు. తదుపరి కులస్పూర్ లో కాంగ్రెస్ పార్టీ నుండి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి లక్ష్మారెడ్డి ని ఎన్నుకోవాలని సూచించారు.

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థి లక్ష్మారెడ్డి కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రoలో  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పథకాలకు మహిళలకే పెద్దపిటా వేసిన అయన గ్రామ సర్పంచ్ లను గెలిపిస్తే గ్రామాలు అభివృద్ధి చెందు్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, మండల అధ్యక్షులు సాయిరెడ్డి, పిసిసి డెలిగేటు శేఖర్ గౌడ్, కాంగ్రెస్ నాయకులు సాయన్న, దిల్వార్ హుస్సిన్ ,గ్రామ ప్రజలు, వి డి సి పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -