నవతెలంగాణ – గాంధారి
త్వరలో జరగబోయే ఎంపీటీసీ, జడ్పిటిసి తోపాటు సర్పంచుల వార్డ్ మెంబర్ల ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని సీపీఐ(ఎం) ఎల్లారెడ్డి ఏరియా కార్యదర్శి మోతి రామ్ నాయక్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బలము లేని చోట లౌకిక పార్టీలకు మద్దతు తెలుపుతామని అన్నారు. బీజేపీ కానీ దానికి మద్దతు తెలిపే పార్టీలను ఓడ కొడతామని అన్నారు. సీపీఐ(ఎం) గాంధారి మండలంలోని పేద ప్రజల కోసం అనేక పోరాటాలు చేసిందని ఆయన గుర్తు చేశారు. పోడు భూముల పోరాటంలో జిల్లాలో 12 లక్షల ఎకరాలు పంపిణీ చేశామన్నారు. ఫారెస్ట్ ఆగడాలు అరికట్టామని అన్నారు. అలాగే ప్రభుత్వ భూములు పేద ప్రజలకు పంచాలని మండలంలోని అనేక పోరాటాలు నిర్వహిస్తున్నామని అన్నారు. పేద ప్రజలకు భూమి దక్కింతవరకు ఇండ్లు ఇండ్ల స్థలాల కోసం, మంచినీళ్ళ వసతుల కోసం నిరంతరం సమస్యల పరిష్కారంలో ముందు ఉంటుందని అన్నారు. అటువంటి నాయకత్వాన్ని బలపరిచి ఓటు వేసి గెలిపించాలని ఈ సందర్బంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు సరాప్ కిషన్ రావు ప్రకాష్ రాములు వసంతరావు లు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES