- Advertisement -
జిల్లా ఎన్నికల అథారిటీ కలెక్టర్ ఆదర్శ్ సురభి
పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
నవతెలంగాణ – వనపర్తి
ఓటర్లు తమ అమూల్యమైన ఓటును ప్రశాంతంగా వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. ఆదివారం వనపర్తి జిల్లాలో రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా వనపర్తి మండలంలోని నాచహళ్లి గ్రామ పంచాయతిలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రం, పెద్దగూడెం గ్రామ పంచాయతీ పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియ, ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించాలని సూచించారు.
- Advertisement -



