Sunday, December 7, 2025
E-PAPER
Homeజిల్లాలుసర్పంచ్‌గా గెలిపించండి..ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తా

సర్పంచ్‌గా గెలిపించండి..ఎమ్మెల్యే సహకారంతో అభివృద్ధి చేస్తా

- Advertisement -

నవతెలంగాణ – సదాశివపేట

సదాశివపేట మండలంలోని సూరారం గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎండి సలావుద్దీన్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2014 నుంచి ప్రజాసేవలో ఉన్నానని, ఆ సంవత్సరంలో కో-ఆప్షన్ మెంబర్‌గా ఐదు సంవత్సరాలు సేవలందించిన విషయాన్ని గుర్తు చేశారు.అలాగే 2019లో తన తల్లి రజియా బేగం సూరారం సర్పంచ్‌గా పనిచేసిన సమయంలో గ్రామంలో విశేష అభివృద్ధి పనులు జరిగాయని, దాదాపు 7 నుంచి 8 కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయని తెలిపారు.

అభివృద్ధి ఒక వైపు, సంక్షేమ పథకాలు మరో వైపు – రెండు దిశల్లో ప్రజలకు లాభం చేకూరేలా కృషి చేసామని చెప్పారు.జాతీయ రహదారి నుంచి సూరారం గ్రామం వరకు గుంతలతో నిండిపోయిన రహదారిని రూ. 2.40 కోట్ల వ్యయంతో బీటీ రోడ్డుగా మార్చించామని, గ్రామంలోని ఇంటర్నల్ సీసీ రోడ్ల కోసం దాదాపు రూ. కోటి ఖర్చు చేశామని సలావుద్దీన్ వివరించారు.ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలను ఉద్దేశించి, “నిండు మనసుతో కత్తెర గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించండి. ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గారి సహకారంతో సూరారం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాను” అని కోరుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -