Monday, December 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జంగిడి శ్రీనివాస్ ను గెలిపించండి..

జంగిడి శ్రీనివాస్ ను గెలిపించండి..

- Advertisement -

గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాది.. రాష్ట్ర ట్రేడ్ చైర్మన్ ప్రకాష్ రెడ్డి
నవతెలంగాణ – మల్హర్ రావు

కాంగ్రెస్ పార్టీ బలపర్షిన మండలంలోని ఎడ్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి జంగిడి శ్రీనివాస్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటామని రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, జిల్లా డిసిసి అధ్యక్షుడు బట్టు కరుణాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బడితేల రాజయ్య అన్నారు. జంగిడి శ్రీనివాస్ తరుపున గ్రామంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి సహకారంతో గ్రామాభివృద్ధి భారీగా నిధులు, అర్హులైన వారికి ఆసరా పింఛన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు తదితర ప్రభుత్వ పథకాలు ప్రతి కుటుంబానికి అందేలా చూస్తున్నారు. ప్రభుత్వం లేనివారికి ఓటువేసిన ఫలితం లేదన్నారు. తన ఉంగరం గుర్తుకు ఓటువేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఇచ్చిన హామీలన్నీ మంత్రి సహకారంతో అమలు చేస్తానని అభ్యర్థి శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నతూoడ్ల సర్పంచ్ గడ్డం క్రాoతి, కాంగ్రెస్ నాయకులు ఐత రాజిరెడ్డి,లక్ష్మీ రాజం, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -