Saturday, December 13, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించండి: ఎమ్మెల్యే వంశీకృష్ణ

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల
ఉప్పునుంతల మండలంలో మూడో విడత స్థానిక ఎన్నికల నేపథ్యంలో శనివారం ఎమ్మెల్యే, డా. చిక్కుడు వంశీకృష్ణ మండల పరిధిలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మర్రిపల్లిలో దేశెట్టి రామచంద్రయ్యా, ఉప్పరపల్లిలో విజయలక్ష్మి, మామిళ్ళపల్లి లో మొకురాల మోహన్ గౌడ్, లక్ష్మాపూర్లో పానుగంటి వెంకటయ్య, పెద్దాపూర్ తొల్ల తిరుపతయ్య, మొల్గర బయ్యపు జ్యోతిరెడ్డి, జప్తి సదగోడు మధ్యల అరుణ, తిర్మలాపూర్ బరిగెల శ్రీకాంత్, కొరటికల్ జగతమ్మ, తిప్పాపూర్ మహేష్, రాయిచెడు తొల్ల లలిత, పురీయా నాయక్ తండా, పెనిమిల్ల, సి బి తాండ, గువ్వలోని పల్లి, లాతిపూర్, ఇరత్వని పల్లి, అయ్యవారి పల్లి గ్రామాల్లో అధికారపార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎన్నికల ప్రచారంలో ఓటర్ల ను ఆయన కోరారు.

ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు పల్లెల్లో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన తెలిపారు. ఉప్పునుంతల మండలంలోని రాయిచెడు గ్రామంలో 2600 మంది విద్యార్థులు చదువుకోవడానికి వీలుగా 200 కోట్లతో నిర్మించనున్న  ఇంటిగ్రేటెడ్ ఇంటర్ నేషనల్ స్కూల్   కూడా టెండర్లు ప్రారంభం అయ్యాయి. అతి త్వరలో పనులను ప్రారంభం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి గ్రామంలో విడతల వారిగా నిర్మాణాలు చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లకు అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అదనంగా మరో 20 నుండి 50 ఇళ్లను ఒక్కో గ్రామానికి మంజూరు చెయ్యనున్నట్లు ఆయన తెలిపారు.

గ్రామాల్లో కావలసిన ప్రతి పనిని సర్పంచుల ద్వారా పూర్తి చేస్తామని అందుకే అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కట్ట అనంతరెడ్డి, మామిళ్ళ పార్టీ ఆలయ చైర్మెన్ వేముల నర్సింహ రావు,మాజీ జడ్పీటీసీ అనంత ప్రతాప్ రెడ్డి,సీనియర్ నాయకులు నరసింహ రెడ్డి,ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులు,వార్డు అభ్యర్థులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -