నవతెలంగాణ – జుక్కల్
ఈ నెల 30న కామారెడ్డి జిల్లా కేంద్రం లోని విజ్ఞాన్ భారతి కళాశాలలో జరిగే 3 వ జిల్లా మహాసభను జిల్లాలోని అన్ని మండలాల్లోని ప్రతి గ్రామ రైతులు, పేద మధ్య తరగతి రైతులతో పాటు అసైన్డ్ పోడు రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను జయప్రదం చేయాలని రైతు సంఘం జిల్లా నాయకుడు సురేష్ గోండ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో రైతు సంఘం ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల కాలంలో రైతుల పక్షాన అసైన్డ్ పోడు రైతుల పక్షాన నిలబడి అనేక పోరాటాలు చేసి ఎస్టీ, గిరిజన సోదరులకు పట్టాలు సాధించుకోవడం జరిగిందని అన్నారు.
ఈ పోరాటం తెలంగాణ రైతు సంఘం గిరిజన రైతులు, అసైన్డ్ పోడు రైతులైన ఎస్సీ, ఎస్టీ, బి సి, మైనార్టీ రైతు సోదరులు ఐక్యాంగ ఉండి జుక్కల్ నియోజకవర్గం లొ పాదయాత్రాలు, బహిరంగ సభలు, రాష్ట్ర నాయకత్వం వచ్చి రైతుల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఘన చరిత్ర తెలంగాణ రైతు సంఘానికి ఉందని గుర్తు చేశారు. ఈ మహా సభలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర తొ పాటు పంట ఇన్స్యూరెన్స్, అసైన్డ్ పోడు రైతులకు పట్టాలు కల్పిస్తూ రైతులందరికీ బ్యాంకు అధికారులు ఎలాంటి షరతులు లేకుండా పంట రుణాలు ఇవ్వాలని కోరుతూ ఇలాంటి పలు అంశాలపై క్షుణ్ణంగా చర్చించి మహాసభ లొ తీర్మానం చెయ్యడం జరుగుతుందనీ అన్నారు. తీర్మానం చెయ్యడానికి ప్రతి రైతు పాల్గొని అనేక తీర్మానాలపై చర్చలో విధిగ హాజరై మహాసభను జయప్రదం చేయాలని సురేష్ గోండ విజ్ఞప్తి చేశారు.



