Saturday, August 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఏఐసీసీ  ప్రధాన కార్యదర్శి పాదయాత్రను విజయవంతం చేయండి..

ఏఐసీసీ  ప్రధాన కార్యదర్శి పాదయాత్రను విజయవంతం చేయండి..

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
జై భీమ్ జై సంవిధాన్ కు కొనసాగింపుగా, 18 నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలు, ప్రజలకు మరింత చేరువుగా చేరి మెరుగుపరుచుకునేందుకు ఏఐసిసి ఇంచార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టారని తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ డిసిసి ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి, ఆ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఆర్మూర్ పట్టణంలోని పివిఆర్ భవన్ లో విలేకరుల సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆగస్టు 2వ తేదీన అలూర్,గగ్గుపల్లి మీదుగా పాత బస్టాండ్ వరకు 10 కిలోమీటర్ల పాదయాత్ర కొనసాగుతుందని చెప్పారు. తిరిగి మూడవ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు పాత బస్టాండ్ లో శ్రమదానం కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అనంతరం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల సమావేశం ఉంటుందన్నారు.

ఈ పాదయాత్రలో జిల్లాకు సంబంధించిన జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, బోధన్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి,షబ్బీర్ అలీ,నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి,బాల్కొండ బాధ్యులు సునీల్ రెడ్డి,రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, అన్ని మండలాల అధ్యక్షులు,చైర్మన్లు ,పెద్ద మొత్తంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొని పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ లు పండిత్ పవన్, అయ్యప్ప శ్రీనివాస్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ మున్ను,మాజీ కౌన్సిలర్ల, ఆర్మూర్ నియోజకవర్గ యూత్ అధ్యక్షులు బైండ్ల ప్రశాంత్, డొంకేశ్వర్ మండల అధ్యక్షుడు భూమేష్, మండలాల అధ్యక్షులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -