- సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి పిలుపు
నవతెలంగాణ-భువనగిరి: ఈ నెల 19 నుండి 22 వరకు మేడ్చల్ జిల్లా గాజులరామారంలోని మహారాజ గార్డెన్స్ లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలు జరగనున్నాయని, ఈ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయం ఆవరణలో రాష్ట్ర 4వ మహాసభలకు సంబంధించిన గోడ పత్రికలను జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా దామోదర్ రెడ్డి మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న ఆవిర్భావించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) నాటి నుండి నేటి వరకు నిరంతరం పేద ప్రజల పక్షాన నిలబడి పోరాడుతూ 100 సంవత్సరాలుగా పూర్తి చేసుకున్న పార్టీ సిపిఐ అని తెలిపారు.
పేదల పక్షాన నిలబడేది ఎర్ర జెండా పార్టీ మాత్రమే అని ఆయన కొనియాడారు. ప్రపంచంలో అత్యంత శ్రమజీవులు, కార్మికులు కలిగిన పెద్ద పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని ప్రపంచంలో ఏ దేశంలోనైనా కమ్యూనిస్టులు ఉంటున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ లాంటి ఇతర బూర్జువా పార్టీలు వారి ప్రాంతాలకు పరిమిత మైతారన్నారు. సిపిఐ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 26న ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభను జిల్లాలోని పార్టీ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బోలగాని సత్యనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు కొల్లూరి రాజయ్య, కురిమిద్ద శ్రీనివాస్, ఎండీ ఇమ్రాన్, చెక్క వెంకటేష్, ఏశాల అశోక్, చిగుర్ల లింగం, మండల కార్యదర్శులు గాదేగాని మాణిక్యం, అన్నేమైన వెంకటేష్, దాసరి లక్ష్మయ్య, పట్టణ కార్యదర్శి పుట్ట రమేష్, నాయకులు సామల శోభన్ బాబు, పల్లపు మల్లేష్ పాల్గొన్నారు.