Saturday, July 26, 2025
E-PAPER
Homeఖమ్మంసీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి 

సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయండి 

- Advertisement -

ఈ నెల 26,27 తేదీల్లో నిర్వహణ….
సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె షాబీర్ పాషా
నవతెలంగాణ – అశ్వారావుపేట

ఈ నెల 26,27 తేదీల్లో నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని శ్రీ శ్రీ కళ్యాణ మండపంలో నిర్వహించే సీపీఐ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి షాబీర్ పాషా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఈ మేరకు ఆయన శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. శతాబ్ధం క్రితం 1925 డిసెంబర్ 26 న భారత కమ్యూనిస్ట్ పార్టీ(కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా – సీపీఐ) ఆవిర్భవించింది అని,వందేళ్ల సుధీర్గ పోరాటాల చరిత్ర కలిగి ఈ దేశ నిర్మాణంలో బాధ్యతాయుతమైన పాత్రను పార్టీ నిర్వహిస్తుంది అన్నారు.దేశ జాతియోధ్యమం పోరాటంలో వీరోచితమైన పాత్రను భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించింది అని, హైదరాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్ లో విలీనం కోసం సాయుధ పోరాటాన్ని నిర్వహించి నాలుగున్నర వేల మంది అమరుల ప్రాణత్యాగం తో తెలంగాణను భరత్ లో విలీనం చేసిన చరిత్ర సీపీఐ ది అని అన్నారు.

ఒక్క తెలంగాణలోనే నాటి సాయుధ పోరాటంలో తర్వాత పోడు,ప్రభుత్వ బంచరాయి భూములు సుమారు 24 లక్షల ఎకరాలు ప్రజలకు సాగు భూమి గా అందించడంలో సిపిఐ దే ప్రధాన పాత్ర అని. ఆధునిక భారతదేశ నిర్మాణంలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన పాత్ర వహించింది అని అన్నారు.     

ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సిపిఐ తృతీయ మహాసభలు చారిత్రాత్మక పోరాటాల ప్రాంతం ఏజెన్సీ గ్రామాలకు కేంద్రంగా అశ్వారావుపేట లోని శ్రీశ్రీ కళ్యాణ వేదిక ( కామ్రేడ్  మియా జానీ నగర్,పోటు ప్రసాద్, బందెల నర్సయ్య,ఏపూరి బ్రహ్మం,యార్లగడ్డ భాస్కరరావు మెమోరియల్ హాల్ ) నందు 2025 జూలై 26, 27 తేదీలలో నిర్వహించడానికి నిర్ణయించి ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడమైనది అని తెలిపారు.

నూతన జిల్లా ఏర్పడిన ఈ పదేళ్ల కాలంలో సిపిఐ ఈ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం అనేక పోరాటాల నిర్వహించింది అని,భూమి సమస్య ప్రధానంగా ఉన్న ఈ జిల్లాల్లో గిరిజన,గిరిజ నేతర పేదల చేతుల్లో ఉన్న భూములకు భద్రత కావాలని,పోడు సాగు చేసుకుంటున్న పేదలకు పత్రాలు ఇవ్వాలని వేలాది మందిని సమీకరించి, మిలిటెంట్ పోరాటాలు నిర్వహించింది అని అన్నారు.ఈ జిల్లా సాగునీటి రంగాల అభివృద్ధి కోసం ప్రణాళికయుతమైన పోరాటాలు చేసిన దశాబ్దాల చరిత్ర సిపిఐ ది. సాగునీటి కోసం జిల్లా రైతాంగం పడుతున్న ఇబ్బందులకు గుర్తించి గోదావరి జలాలను ఈ జిల్లా కు మళ్ళించడం ద్వారా ఈ ప్రాంత భూములను సస్యశ్యామలం చేసేందుకు సిపిఐ నిరంతరం కృషి చేస్తుంది.

సింగరేణి, కేటీపీఎస్, బిపిఎల్, హెవీ వాటర్ ప్లాంట్, ఎన్ఎండీసి, నవభారత్ తదితర ప్రభుత్వ రంగ పరిశ్రమలలో కార్యవర్గానికి అండగా నిలిచింది.వారి హక్కుల సాధనలో, పరిశ్రమ పురోగతిలో సిపిఐ తన ప్రజా సంఘాలు ఎనలేని కృషిని కొనసాగిస్తున్నాయి. జిల్లాలో లక్షలాదిగా ఉన్న అసంఘటిత కార్మిక వర్గాన్ని, వ్యవసాయ కార్మికులను, రైతులను, యువజన, విద్యార్థి, సమర శీల పోరాటాలను ఈ జిల్లాలో సిపిఐ నిర్వహిస్తోంది.భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన కోసం, సకల రంగాల్లో జిల్లా సమ్మిళిత అభివృద్ధి సాధన కోసం రానున్న మూడు సంవత్సరాల కార్యాచరణను ఈ మహాసభల్లో తీర్మాణం చేస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గం కార్యదర్శి సయ్యద్ సలీం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నరాటి  ప్రసాద్,సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు రామకృష్ణ, భవన నిర్మాణ కార్మికుల జిల్లా అధ్యక్షులు వేల్పుల మల్లికార్జున్,సిపిఐ జిల్లా సమితి సభ్యులు రాహుల్ ,సిపిఐ అశ్వారావుపేట పట్టణ కార్యదర్శి నూకవరపు విజయ్ కాంత్,సయ్యద్ రజ్వీ  నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -