సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు
నవతెలంగాణ – నూతనకల్
నిరంతరం ప్రజల పక్షుల పోరాడే సీపీఐ(ఎం) బలపరిచిన అంజపల్లి నరసమ్మ ఉంగరం గుర్తు కు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొలిశెట్టి యాదగిరిరావు అన్నారు. శనివారం మండల పరిధిలోని చిల్పకుట్లలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిరంతరం గుర్తించి, వాటి పరిష్కార కోసం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్ స్ట్ నిరంతరం ప్రయత్నం చేస్తున్నదని గుర్తు చేశారు. రైతు రుణమాఫీ పండించిన పంటకు గిట్టుబాటు ధర, సాగునీటి కోసం, మండలంలో పార్టీ అనేక ఉద్యమాలు చేసిందని అన్నారు. గ్రామంలో తాగునీటి, విద్యుత్ దీపాలు,వంటి అనేక మౌలిక వసతులపై పోరాడుతుందని అన్నారు. మండల కేంద్రం నుండి సంగం గ్రామం వరకు అద్వానంగా ఉన్న రోడ్డు పునర్నిర్మాణం కోసం సుమారు 10 కిలోమీటర్లు మండల కమిటీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టామని శాసనసభ సభ్యులు, అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పటికీ రోడ్డు నిర్మాణం కాలేదని రోడ్డు నిర్మించే వరకు ఉద్యమాలు చేస్తామని అన్నారు.
ప్రజల పక్షాన పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



