సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి: ఎండి జహంగీర్
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
వీరతెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రజా విజయాలు వాస్తవాలు వక్రీకరణలు అనే అంశంపై ఈనెల 9న శ్రీ సాయి శ్రీనివాస (దివ్య) ఫంక్షన్ హాలులో జరుగు జిల్లా సదస్సును జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ అన్నారు. ఈ సదస్సుకు సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు మాజీ శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు హాజరవుతారని వారు తెలిపారు. శుక్రవారం సీపీఐ(ఎం) కార్యాలయంలో సదస్సు కరపత్రం ఆవిష్కరణ చేసి అనంతరం వారు మాట్లాడుతూ.. కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన గిరిల్లా యుద్ద తంత్రంలో మూడు వేలకు పైగా గ్రామాలు విముక్తి అయ్యాయని అన్నారు. 10 లక్షల ఎకరాల భూమి పేదల స్వాధీనంలోకి వచ్చిందని తెలిపారు.
రక్షిత కౌలుదారు చట్టాన్ని సాధించింది కమ్యూనిస్టులని అన్నారు. మహాత్మా తెలంగాణ పోరాటం అద్భుత విజయాలు సాధించిందని వారన్నారు. దోపిడి, పీడన, అసమానతలతో బానిస బతుకుల విముక్తికై, కుల మతాలకు అతీతంగా జరిగిన ఈ పోరాటం దేశ విదేశాలను ఆకర్షించిందని గుర్తు చేశారు. రైతాంగ కార్మిక సమస్యలను ప్రధాన ఎజెండాగా మార్చిందని అన్నారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని వెలుగెత్తి చాటిందని వారు అన్నారు. రాజకీయాల్లో విలువల్ని ఆవిష్కరించి పేదల సామాజిక గౌరవం కోసం ప్రశ్నించే తత్వాన్ని నేర్పిందని అన్నారు. నాటి నుండి నేటి వరకు కమ్యూనిస్టులు అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వర్గ సామాజిక పోరాటాలు బహుముక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజా చైతన్యాన్ని పెంచే క్రమం కొనసాగుతూనే ఉందని వారు అన్నారు.
ఎలాంటి త్యాగచరితలేని, పోరాట వారసత్వం లేని, ప్రజా అభ్యుదయం లేని, మతోన్మాద అవకాశవాద రాజకీయాలకు తెరలేపిన బిజెపి సంఘ పరివార శక్తులు మహోజ్వల వీర తెలంగాణ పోరాట చరిత్రను వక్రీకరించాలని చూస్తుందని వారన్నారు. వీర తెలంగాణ సాయుధ పోరాటం ప్రజా విజయాలు, వాస్తవాలు, వక్రీకరణలు అనే అంశంపై ఈనెల 9న జరుగు జిల్లా సదస్సును జయప్రదం చేయాలని వారు కోరారు. వీరితోపాటు రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, బట్టుపల్లి అనురాధ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, మాయ కృష్ణ, బోలగాని జయరాములు లు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) జిల్లా ప్రజా సదస్సును జయప్రదం చేయండి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES