Saturday, December 6, 2025
E-PAPER
Homeజిల్లాలుసీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి

సీపీఐ(ఎం) సర్పంచ్ అభ్యర్థిని గెలిపించండి

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు సూడికృష్ణారెడ్డి
నవతెలంగాణ – గోవిందరావుపేట

సీపీఐ(ఎం) పసర గ్రామ సర్పంచ్ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ గెలిపించడం ద్వారానే  గ్రామం అభివృద్ధి చెందుతుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యుడు సూడి కృష్ణారెడ్డి అన్నారు. శనివారం సీపీఐ(ఎం) కార్యాలయంలో మండల కార్యదర్శి సోమ మల్లారెడ్డి అధ్యక్షుతన జరిగిన విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ.. గత 35 సంవత్సరాలు సీపీఐ(ఎం) సర్పంచులు గ్రామ అభివృద్ధి కోసం ఎనలేని సేవలు అందించారని అన్నారు. గ్రామాన్ని ఐక్యంగా సామరస్యంతో నడిపారని తెలిపారు. కానీ గత ఐదు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ నుండి సర్పంచ్ గెలిపిస్తే గ్రామాన్ని రెండు ముక్కలుగా చేశారని గ్రామంలో అశాంతి నెలకొన్నదని తెలిపారు.

ఎంతో ప్రయాసలకు ఓర్చి ఏర్పాటు చేసిన రెండు రూపాయల వాటర్ ప్లాంట్ మూసివేసారని అన్నారు. గ్రామంలో గత సీపీఐ(ఎం) సర్పంచి ఆధ్వర్యంలో ఎనిమిది బోర్లు గతంలో ఉంటే ప్రస్తుత కాంగ్రెస్ పాలకులు వాటి మరమ్మత్తులు చేపట్ట పోవడంతో పూర్తిగా ధ్వంసం అయ్యాయని మోటార్లు పనికిరాకుండా పోయాయని తెలిపారు. అంతర్గత రోడ్లను విస్మరించారని ఆరోపించారు. వీధిలైట్లు లేక గ్రామమంతా చీకటిమంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజల గోసని పట్టించుకోని ఈ కాంగ్రెస్ గ్రామపంచాయతీ పాలకులకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నదని అన్నారు సీపీఐ(ఎం) బలపరిచిన రాజేష్ దేవేంద్ర లను గెలిపించడం ద్వారా గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొంటుందని తెలిపారు.

గ్రామ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి గ్రామపంచాయతీ నిధులకు జవాబుదారీగా ఉంటుందని ప్రజల పక్షాన సీపీఐ(ఎం) సర్పంచ్ నిలబడతారని అందుకోసం సీపీఐ(ఎం) అభ్యర్థి సనప దేవేంద్ర రాజేష్ కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి గ్రామాన్ని రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బిరెడ్డి సాంబశివ, సర్పంచ్ అభ్యర్థి దేవేంద్ర రాజేష్ ,తీగల ఆగిరెడ్డి, పొదిళ్ల చిట్టిబాబు,  అంబాల మురళి, క్యాతం సూర్యనారాయణ, ఉమ్మడి ఉపేంద్ర చారి, కడారి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -