Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఈనెల 7న ఆహ్వాన సంఘ సమావేశాన్ని జయప్రదం చేయండి

ఈనెల 7న ఆహ్వాన సంఘ సమావేశాన్ని జయప్రదం చేయండి

- Advertisement -

-ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 

ఫిబ్రవరి 9, 10, 11న జరిగే రాష్ట్ర సదస్సు సందర్భంగా ఈనెల 7న యాదగిరిగుట్టలో జరిగే ఆహ్వాన సంఘం కమిటీ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ అన్నారు. సోమవారం, యాదగిరిగుట్ట మండలం మల్లాపురం, ఎన్ పి ఆర్ డి గ్రామ కమిటీ సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం 2011 నుండి ఇప్పటివరకు రూ..300 పెన్షన్ మాత్రమే ఇస్తున్నది. ఇది వికలాంగులపై చిన్న చూపేనని అన్నారు. ఇది దుర్మార్గమైన చర్య కానీ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 రెట్లు ధరలు పెంచి  వికలాంగులపై భారాలు పెంచి ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. అందుకని వికలాంగులకు రూ.5000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది అన్నారు.

అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలలో ముందు హామీ ఇచ్చి సుమారు రెండు సంవత్సరాలు గడిచిన ఇప్పటికీ రూ.6000 పెన్షన్ ఇవ్వడం లేదు. ఇప్పటికైనా పెన్షన్ వెంటనే ఇవ్వాలని వికలాంగులకు 300 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, వికలాంగులకు ఉపాధి అవకాశాల కొరకు బ్యాంకు ద్వారా ఎలాంటి చర్తులు లేకుండా 100% సబ్సిడీతో పది లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని అన్నారు. వికలాంగులకు అంత్యోదయ రేషన్ కార్డు 35 కిలోల బియ్యం ఇవ్వాలని, వికలాంగులకు ఉపాధి హామీ పని పథకంలో 200 రోజులు పని కల్పించి రోజుకు రూ.600 కూలి ఇవ్వాలని తెలిపారు. వికలాంగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని, మానసిక వికలాంగులకు భువనగిరి మండలంలో మానసిక వికలాంగులకు గవర్నమెంట్ ప్రత్యేక స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది అన్నారు. అనంతరం మల్లాపురం గ్రామంలో నూతన గ్రామ కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి  గౌరవ అధ్యక్షురాలు చల్లూరి రేణుక, అధ్యక్షులు కామరాజు రామచంద్రయ్య, ఉపాధ్యక్షులు రంగ సంతోష్, కార్యదర్శి పలపాటి ప్రభాకర్, సహాయక కార్యదర్శి కర్రే అందాలు,  కోశాధికారి సీకా నరసింహ, కర్రే సిద్ధమ్మ, ఒగ్గు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -