Wednesday, July 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జూలై 9 సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ

జూలై 9 సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్  : జూలై 09 న జరిగే దేశవ్యాపిత సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ కార్మికులకు పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలను వెంటనే చెల్లించండి అని,మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలి సిఐటియు జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం రెంజల్ మండలం నీలా గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ జాన్కంపేట్ సారంగాపూర్ నెహ్రు నగర్ లో గ్రామపంచాయతీ కార్మికులు లిఫ్ట్ ఇరిగేషన్ కార్మికులు విత్తనాలు శుద్ధి చేసే కార్మికుల వద్ద జులై 9న జరిగే సార్వత్రిక సమ్మె కరపత్రాలను బుక్ లెట్ లను ఇస్తూ ప్రచారం నిర్వహించి జులై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని అన్నారు.

కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రయోజనం కోసం పనిచేస్తున్నది తప్ప కార్మికులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. గతంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 చట్టాలను రద్దు చేసి వాటికి బదులుగా కార్మికులను నష్టం చేసే నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని విమర్శించారు. కనీస వేతనం, సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె హక్కు లేబర్ కోడ్ ల ద్వారా కాలరాయబడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 8గంటల పనిని 12గంటలకు పెంచి కార్మికులను శ్రమ దోపిడీకి గురి చేశారని విమర్శించారు.

కులం, మతం, అస్తిత్వ భావజాలంతో కార్మికొద్యమం దెబ్బ తీయడానికి, రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి బిజెపి ప్రయత్నిస్తుందని తెలియజేశారు.మోదీ అధికారంలోకి వచ్చిన నుండి కార్పొరేట్ లకు 16 లక్షల 35 వేల కోట్లు మాఫీ చేశారని విమర్శించారు.కావున కార్మికులు ఐక్య పోరాటలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో కార్మిక సంఘాలు ఇచ్చిన జూలై 09 దేశ వ్యాపిత సమ్మెను కార్మిక వర్గ కర్తవ్యంగా భావించి ప్రతీ కార్మికుడు సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. మరియు గ్రామ పంచాయితీ సిబ్బంది సమస్యలను బకాయి వేతనాలను మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని మల్టీ పర్పస్ విధానం వచ్చిన తర్వాత ఒక్కరికి 12 రకాలుగా పనులను అప్పజెప్తున్నారని కనీస వేతనాలు లేవు ఉద్యోగ భద్రత లేదు.

ఈ ఎస్ ఐ పి ఎఫ్ సౌకర్యం లేదు. మరణించిన ఎవరూ పట్టించుకోరు. వారసత్వం కొనసాగింపు లేదు. ఇప్పటివరకు రెక్కాడితే తప్ప డొక్కాడని పరిస్థితులలో కార్మికులు బతుకుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు కానీ ఈ రోజటి వరకు సమస్యలను పరిష్కారం చేయలేదు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని బకాయి వేతనాలు ఇవ్వకుంటే పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పసియోద్దీన్ , అర్బస్, చిన్న లాలు, సాయవ్వ ఆసియా గంగారం భూదేవ్వ విజయ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -