వేం యాకూబ్ రెడ్డి పి ఆర్ టి య ములుగు జిల్లా అధ్యక్షులు
నవతెలంగాణ – గోవిందరావుపేట
సిపిఎస్ రద్దును కోరుతూ సెప్టెంబర్ 1న హైదరాబాదులో ఇందిరాపార్కు దగ్గర చేపట్టనున్న మహా ధర్నా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పి ఆర్ టి యు ములుగు జిల్లా అధ్యక్షులు వేం యాకూబ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం టి ఆర్ టి యు మండల అధ్యక్షుడు ఘనతల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సి పీ ఎస్ రద్దు కొరకై మండల వ్యాప్తంగా పలు పాఠశాలలో మహాధర్నా పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు.
ఈ సందర్భంగా యాకోబు రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 1న హైదరాబాదులో ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా కార్యక్రమం పి ఆర్ టి యు టి ఎస్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగిందనీ ఇట్టి కార్యక్రమానికి మండలంలో ఉన్నటువంటి సిపిఎస్ మరియు ఓపిఎస్ ఉద్యోగులందరూ కూడా మహా ధర్నాకు హాజరు కావాలన్నారు. అందుకు ఉపాధ్యాయులను సమాయత్తం చేయుట కొరకు అన్ని పాఠశాలలో తిరిగి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పాడియా తులసీరామ్ మరియు సీనియర్ కార్యకర్తలు మరియు మాలోత్ శ్రీరాములు రాజమౌళి వెంకటేశ్వర్లు రాజేందర్ ఉపాధ్యాయులందరూ పాల్గొనడం జరిగినది.
సీపీఎస్ రద్దుకై మహాధర్నాను జయప్రదం చేయండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES