Sunday, August 31, 2025
E-PAPER
spot_img
Homeజిల్లాలుఉపాధి మేళాను సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీఓ

ఉపాధి మేళాను సద్వినియోగం చేసుకోండి: ఎంపీడీఓ

- Advertisement -

నవతెలంగాణ – పరకాల : దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకంలో భాగంగా పరకాల మండల పరిధిలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉచిత శిక్షణ ఉపాధి మేళా నిర్వహించడం జరుగుతుందని పరకాల ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు తెలిపారు. మండల పరిధిలోని గ్రామాలకు సంబంధించిన నిరుద్యోగ యువతీ యువకులు జులై 1న ఉదయం 10 గంటలకు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలు, రేషన్ కార్డు ఆధార్ కార్డు తీసుకొని హాజరు కావలసినదిగా కోరారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..ఇందులో ఎంపికైన వారికి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ డిడియుజికేవై పథకం, రాష్ట్ర ప్రభుత్వం ఈజిఎంఎం శాఖ సంయుక్తంగా శ్రీ టెక్నాలజీ వరంగల్ ఆధ్వర్యంలో వేర్ హౌస్ అసోసియేటెడ్ కోర్సుతోపాటు కంప్యూటర్ ట్రైనింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వబడునని తెలిపారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనము, వసతి యూనిఫామ్ రూ.3 వేల స్కాలర్షిప్ , నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం ఈజీఎంఎం సర్టిఫికెట్ ఇవ్వబడునని అన్నారు. శిక్షణ అనంతరం ప్రముఖ కార్పొరేట్ కంపెనీల యందు ఉద్యోగ అవకాశం కల్పించబడుని పూర్తి వివరాల కోసం 9849131050, 9642141539 నెంబర్లలో సంప్రదించాలన్నారు. పరకాల మండల పరిధిలోని నిరుద్యోగ యువత ఈ సదావకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా ఎంపీడీఓ పెద్ది ఆంజనేయులు సూచించారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad