నవతెలంగాణ – బల్మూరు
ఐసిడిఎస్ ప్రాజెక్టు బల్మూరులో నెల రోజులపాటు జరిగే పోషణ మాసోత్సవం కార్యక్రమాన్ని ఐసిడిఎస్ సిబ్బంది అంగన్వాడి టీచర్లు విజయవంతం చేయాలని డిప్యూటీ తహశీల్దార్ కొర్ర కేశవులు అన్నారు. పోషన్ బి.. పడాయి బి.. మూడోరోజు శిక్షణ కార్యక్రమం ముగింపు కార్యక్రమానికి ఆయన విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత మూడు రోజులుగా శిక్షణ పొంది గ్రామాలకు వెళ్లి సంబంధిత అంగన్వాడి కేంద్రాల లబ్ధిదారులను పోషకాహారం విషయంలో చైతన్యపరచాలని అన్నారు.
నేటి నుండి నెల రోజులపాటు పోషణ మాసం సందర్భంగా ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో మీరు తీసుకుంటూ గ్రామంలో ప్రతి ఒక్కరు తీసుకునే విధంగా చూడాలని సూచించారు. మండల వ్యాప్తంగా మరియు ప్రాజెక్టు వారిగా మూడు మండలాల్లో పోషణ మాసం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. కార్యక్రమంలో బల్మూరు ప్రాజెక్టు సిడిపిఓ దమయంతి, సూపర్వైజర్లు నిర్మల, బిపాషా, సునీత, గిరిజ, పోషణ అభియాన్ కో – ఆర్డినేటర్ పార్వతి బల్మూరు, లింగాల, ఉప్పునుంతల అంగన్వాడి టీచర్లు ఉన్నారు.