- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : పెన్షన్ చెల్లింపులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించేందుకు ఆదివారం పెన్షనర్స్ అండ్ సీనియర్ సిటిజన్స్ భవన్ నందు ఉదయం 10 గంటలకు జిల్లాస్థాయి సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా కన్వీనర్ రామ్మోహన్ రవు తెలిపారు. ఈ మేరకు శనివారం సంఘ భవనంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేపు జరిగే సదస్సును విజయవంతం చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.ఈ సమావేశంలో ఎంప్లాయిస్ స్టడీ సర్కిల్ జిల్లా కన్వీనర్ కే రామ్మోహన్ రావు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు ఈవిల్ నారాయణ, హమీ దుద్దీన్, లావు వీరయ్య, లక్ష్మీనారాయణ, రాధా కిషన్, తదితరులు ఉన్నారు.
- Advertisement -