ఎస్ కేర్ సాబీర్ పాషా..
నవతెలంగాణ – మణుగూరు
డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో రావాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా బుధవారం మణుగూరు మండలం సాంబయ్య గూడెం గ్రామానికి చెందిన సుమారు 30 కుటుంబాలు సిపిఐ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కె సాబీర్ పాషా సమక్షంలో సిపిఐ పార్టీలో చేరారు. వీరికి ఎర్ర జెండా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం హాజరై మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సరెడ్డి పుల్లారెడ్డి, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి మున్న లక్ష్మీకుమారి, సీపీఐ మణుగూరు మండల పట్టణ కార్యదర్శి లు జక్కుల రాజబాబు దుర్గ్యాల సుధాకర్, జిల్లా సమితి సభ్యులు జంగం మోహన్ రావు, మాజీ ఎంపీపీ ఎడారి రమేష్, సొందే కుటుంబరావు, తదితరులు పాల్గొన్నారు.



